YSR విగ్రహం ధ్వంసం.. ఎర్రబెల్లికి షర్మిల వార్నింగ్

-

ఎర్రబెల్లికి వార్నింగ్ ఇచ్చారు షర్మిల. అవుతాపూర్ లో మహానేత విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య అని… అర్ధరాత్రి బీఆర్ఎస్ గూండాలు చేసిన పని ఇది. దయలేని దయాకర్ రావు దగ్గరుండి మరీ చేయించిన ఘాతుకం ఇది. విగ్రహాన్ని పడగొట్టిన గూండాలకు నాయకుడు ఈ ఎర్రబెల్లి అని అగ్రహించారు. స్వయంగా మహిళలు చలిమంట వేసుకొని కట్టించిన విగ్రహంపై మొదటి నుంచే మంత్రికి కన్ను అన్నారు.

ఆ రోజే విగ్రహ ఏర్పాటు అడ్డగించేందుకు శతకోటి ప్రయత్నాలు చేశాడు. ముందుండి నిలబడ్డ మహిళలకు పథకాలు బంద్ పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా విగ్రహం నిలిచేసరికి మంత్రికి నిద్రపట్టలేదు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న YSR అభిమానాన్ని తట్టుకోలేకపోయాడు. అర్థరాత్రి గూండాలను పెట్టి జేసీబీలతో ధ్వంసం చేయించాడు. ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా..ఖంత్రివా..!అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ములేక విగ్రహాల మీదనా నీ రాజకీయం? పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు కట్టుడు చేతకాలేదని చురకలు అంటించారు.

కనీసం డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకోలేని అసమర్థ మంత్రివి నువ్వు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉండి, బీరు బాటిళ్లు, బ్రాండి బాటిళ్లు అమ్ముకో అని చెప్పిన సన్నాసి నువ్వు.. చదువు, సంస్కారం లేని వ్యక్తిని మంత్రిని చేస్తే.. విగ్రహాలను పడగొట్టడం మీదున్న సోయి అభివృద్ధి మీద ఎక్కడుంటది? నువ్వు మంత్రివే అయితే.. నీ పేరులో దయ ఉంటే వెంటనే YSR విగ్రహాన్ని పెట్టించి నీ నిజాయతీ నిరూపించుకో.. ఒక్క విగ్రహాన్ని పడగొడితే పాలకుర్తిలో వెయ్యి విగ్రహాలు పెడతాం. YSR బిడ్డ నీకు విసురుతున్న సవాల్ అని షర్మిల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news