పార్కులకు వెళ్లే లవర్లకు GHMC షాక్!

-

పార్కులకు వెళ్లే లవర్లకు షాక్ ఇవ్వనుంది జిహెచ్ఎంసి. హైదరాబాద్ నగరంలోని కొన్ని పార్కులకు ఫ్యామిలీలు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి. కొందరు ప్రేమికులు బహిరంగంగా రొమాన్స్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తారు. మరికొన్ని చోట్ల చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పార్కులోను సీసీ కెమెరాలు పెట్టేందుకు జిహెచ్ఎంసి సిద్ధమైంది. 8 వేల కెమెరాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు నేడు ఆమోదముద్ర వేయనుంది. ఒకవేళ 8 వేల కెమెరాలను ఏర్పాటు చేస్తే.. పార్కులకు వెళ్లే లవర్లకు చాలానే ఇబ్బందులు వస్తాయి. వారి ప్రైవసీకి భంగం కలుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news