మొయినాబాద్​ ఫామ్​హౌస్ కేసు.. మరో ఇద్దరికి నోటీసులు

మొయినాబాద్ ఫామ్​హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ఇద్దరికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్‌ భార్య చిత్రలేఖ, అంబర్‌పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు పంపింది. ఇవాళ ఇద్దరూ విచారణకు హాజరుకావాలని సిట్‌ ఆదేశించింది.

ఇప్పటివరకు నోటీసులకే పరిమితం కాగా.. ప్రస్తుతం అరెస్ట్‌ల దిశగానూ సిట్‌ అడుగులు వేస్తోంది. ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారతీయ ధర్మజనసేన చీఫ్‌ తుషార్‌లకు నోటీసులు ఇచ్చినా.. ఇప్పటివరకు సిట్‌ ముందు హాజరుకాలేదు. ఇందులో న్యాయవాది శ్రీనివాస్‌ మాత్రమే రెండు రోజులపాటు సిట్‌ విచారణకు హాజరయ్యారు. జగ్గుస్వామికి, తుషార్​కు సిట్‌ లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. కొత్తగా నోటీసులు అందుకున్నవారిని ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ విచారించనుంది.