సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారు. ఇవాళ ఉదయం 11 గణతల సమయంలో తెలంగాణ సిఎం కేసీఆర్.. యశోద ఆస్పత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల జరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం వి రావు.. ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ కు పరీక్షలు చేస్తుంటాం..రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారాయన అని వైద్యులు చెప్పారు.
సాధారణ పరీక్షలు చేశాం.ఎడమ చెయ్యి,ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు.రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీఎం గారికి సీటీ స్కాన్, కరొనరీ యాంజియోగ్రామ్ చేస్తున్నాం.పరీక్షల ఫలితాలను అనుసరించి ఏం చేయాలో చూస్తాం.వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.ఇది కేవలం ముందు జాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమేనని ఎం.వి.రావు స్పష్టం చేశారు.
కాగా సీఎం కేసీఆర్ వెంట ఆయన భార్య, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఇక అటు ఉప్పల్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్… యశోద ఆసుపత్రికి చేరుకున్నారు.