తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..దసరా, సంక్రాంతి సెలవులు ప్రకటించిన సర్కార్

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. దసరా, సంక్రాంతి సెలవులు ప్రకటించింది కేసీఆర్‌ సర్కార్. నిన్నటి నుంచే తెలంగాణ లో జూనియర్ కాలేజీ లకు వేసవి సెలవులు అని ప్రకటించింది ఇంటర్‌ బోర్డు. జూన్ ఒకటి న కాలేజీలు పునః ప్రారంభమని.. వేసవి సెలవుల్లో కాలేజీ లు తెరవద్దని… తెలిపింది.

ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టాలి.. సెలవుల విషయం లో నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణించబడుతుందని తెలిపింది. జూన్ ఒకటి నుండి కాలేజీ లు ప్రారంభం అవుతుందని… అక్టోబర్ 19 నుండి 25 వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొంది. నవంబర్ 20 నుండి 25 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయని… వచ్చే ఏడాది జనవరి 13 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది. మార్చి 2024 మొదట వారం లో ఇంటర్ పరీక్షలు ఉంటాయని.. 227 పని దినాలు ఉంటాయని చెప్పింది ఇంటర్‌ బోర్డు.

Read more RELATED
Recommended to you

Latest news