BREAKING : రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినేట్‌ సమావేశం..ఇక కేంద్రంపై యుద్ధమే !

-

రేపు తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌ సమావేశం జరుగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ప్రగతి భవన్‌ వేదికగా ఈ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు అధ్యక్షతన కొనసాగే.. ఈ కేబినేట్‌ సమావేశంలో మంత్రులంతా హాజరు కానున్నారు. యాసంగి కొనుగోలు అంశం, కేంద్రం పై పోరాటం, బీజేపీ పార్టీని ఎలా ఎదుర్కొవాలి, గవర్నర్‌ తమిళిసై వ్యవహారం ఇలా చాలా అంశాలపై తెలంగాణ కేబినేట్‌ చర్చించే ఛాన్స్‌ ఉంది.

కాగా.. ఇవాళ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేస్తుంది.కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ 24 గంటల డెడ్‌ లైన్ ఇచ్చారు. 24 గంటలలోపు ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోతే… రైతు ఉద్యమంతో.. భూకంపం సృష్టిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news