ఇవాళ విజయవాడకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

Telangana Chief Minister Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడ పర్యటన ఖరారు అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్సార్ 75వ జయంతి సభకు ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Telangana Chief Minister Revanth Reddy to Vijayawada today

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేతలను ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అటు కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆదివారం రాత్రికి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో బస చేశారు వైఎస్‌ షర్మిల. ఇక ఇవాళ వైయస్ జయంతి సందర్బంగా ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైయస్ ఆర్ సమాధివద్ద నివాళులు అర్పించనున్నారు షర్మిల. అనంతరం విజయవాడకు పయనం అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version