కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాపీ… ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ అంటే నినాదం కాదని పేగుబంధం అని అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే ఎన్నికల ముడి సరుకు కాదని.. ఓట్లు రాసే ముడి సరుకు కాదని, మాకు ఆత్మ గౌరవం అని ఆయన అన్నారు. రైతుల పక్షాల కాంగ్రెస్ పూర్తి బాధ్యత తీసుకుని వరంగల్ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని…365 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని… సోనియా గాంధీ రాజ్యం ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏక కాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని… ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి కింద రూ. 15,000 సాయం అందిస్తామని డిక్లరేషన్ ప్రకటించారు. ఉపాధి హామీ కింద భూమి లేని రైతు కూలీలకు ప్రతీ ఏడాది రూ. 12000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. రైతులు పండించిన పంటలకు వరి, పత్తి, పసుపు మెదలైన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధరతో చివరి గింజ వరకు కొంటామని ప్రకటించారు. తెలంగాణలో మూత పడిన చెరుకు కర్మాగారాలను తెరిపిస్తామని… పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రైతులపై భారం లేకుండా మెరుగైన పంటల బీమా తీసుకువస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతీ రైతుకు పంటనష్ట పరిహారం అందేలా చేస్తామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతుల్ని ఆదుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోడు భూములకు పట్టారు, అసైన్డ్ భూములపై పేదలకు క్రయవిక్రయాల అవకాశాన్ని కల్పిస్తామని… రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తామని… సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని రేవంత్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news