లాకప్ డెత్​లపై డీజీపీ అంజనీ కుమార్ కీలక ఆదేశాలు

-

రాష్ట్రంలో ఇటీవల ఎక్కువగా జరుగుతున్న లాకప్ డెత్ లపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. దైనా కేసు దర్యాప్తు చేసే క్రమంలో మానవ హక్కులను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వాళ్లను హింసించడం, లాకప్ డెత్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే సహించేది లేదని అంజనీ కుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, డీఎస్పీలతో డీజీపీ అంజినీ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా.. పోలీసులు దర్యాప్తులో ఉపయోగపడే విధంగా ఆధారాలు సేకరించాలని అధికారులకు డీజీపీ సూచించారు. సాంకేతికత ఉపయోగించుకొని కేసు దర్యాప్తు చేయాలని చెప్పారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుడికి సరైన గౌరవం దక్కకపోతే సాంకేతికత ఎంత పెరిగినా లాభం లేదని అంజనీ కుమార్ గుర్తు చేశారు. దర్యాప్తు వేగవంతంగా జరగడానికి వైజ్ఞానిక, శాస్త్రీయ ఆధారాలు ఎంతో ఉపయోగపడతాయని డీజీపీ అభిప్రాయపడ్డారు. చిన్నారులపై లైంగిక దాడుల విషయంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు డీజీపీ.

Read more RELATED
Recommended to you

Latest news