దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది – మంత్రి జగదీష్ రెడ్డి

-

దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. దీనికి విద్యుత్ వినియోగమే నిదర్శనం అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో విద్యుత్ మీద ఆధారపడి వ్యవసాయ రంగం ఉండేదన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతుందని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు.

రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటిమయం అవుతుందని గత పాలకులు విమర్శించారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన కేవలం ఐదు నెలలలోనే వ్యవసాయానికి మినహా 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. మూడేళ్లలోపు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామన్నారు. గతంలో తలసరి విద్యుత్ 975 యూనిట్లు కాగా.. ఇప్పుడు 2,126 యూనిట్లుగా ఉందన్నారు. యూపీలో తలసరి విద్యుత్ వినియోగం 400 యూనిట్లు కూడా లేదని అన్నారు. గుజరాత్లో కూడా వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news