ఇంతకు ముందు ఇళ్లలో డిష్‌లు ఉండేవి.. ఇప్పుడు అంతా వైఫైలకు అలవాటు పడ్డారు. టీవీలో వచ్చింది చూడటం కాదు.. చూడలనుకుంది వస్తుంది. ఓటీటీ మహిళ అలా ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వైఫై 6 స్థానంలో.. అత్యాధునిక ఫీచర్లతో వైఫై 7త్వరలో రాబోతుంది. వైఫై 7ను డెవలప్ చేస్తున్నట్లు మోబైల్ ప్రాసెసర్ తయారీ సంస్థ క్వాల్ కోమ్ వెల్లడించింది. ప్రస్తుత వైఫైతో పోల్చితే వైఫై 7 డబుల్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందిస్తుందట.
వైఫై 7 గురించి క్వాల్ కోమ్ కీలక విషయాలు వెల్లడించింది. వేగంగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమేకాకుండా, లో-లాటెన్సీ ఫెర్మామెన్స్ను మరింత పెంపొందింపజేసినట్లు తెలిపింది. ఆధునీకరించి వైఫై 7తో ఎక్స్ఆర్, మెటావర్స్, సోషల్ గేమింగ్, ఎడ్జ్ కంప్యూట్ సహా పలు సేవలను అత్యంత వేగంగా, అత్యంత క్వాలిటీగా పొందే వెసులుబాటు ఉంటుందని తెలిపింది.
పవర్ ఫుల్ ఎమ్ఎల్ఓ ఫీచర్ తో పాటు మరెన్నోనూతన సేవలు వైఫై 7తో యూజర్ల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ప్రీమియం మొబైల్, ట్యాబ్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్లను కొనుగోలు చేసినప్పుడు టెక్ ఫీచర్లను గమనిస్తే వైఫై 6ను సపోర్ట్ చేస్తుందని రాసి ఉంటుంది. మనలో చాలా మంది ఓఎస్, బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్ వంటి వాటి గురించి తెలుసు. కానీ, డివైజ్‌లోని ఇతర టెక్నికల్ విషయాల గురించి పెద్దగా అవగాహన ఉంటుంది. ఇప్పటి వరకు వైఫై6 అని ఉన్న చోట రాబోయే రోజుల్లో వైఫై7 అని ఉండబోతుంది. వైఫై 7లో వైర్లెస్ కనెక్టివిటీ స్టాండర్డ్ ట్రాన్సిమిషన్ రేట్ 30 జీబీపీఎస్ వరకు ఉండవచ్చని తెలిసింది.
ప్రస్తుతం ఉపయోగం లో ఉన్న వైఫై 6లో ఈ ట్రాన్సిమిషన్ రేట్ కేవలం 9.6 జీబీపీఎస్ ఉంది. అంటే వైఫై 6తో పోల్చితే వైఫై 7 సుమారు మూడు రెట్లు వేగంగా ఇంటర్నెల్ సేవలను అందించే అవకాశం ఉంది. అటు వైఫై 7లో 320 మెగాహెర్జ్ సిగ్నల్ ఛానెల్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. ప్రస్తుతం వాడుతున్న వైఫై 6లో ఇది కేవలం 160 మెగాహెర్జ్ మాత్రమే ఉంది. బ్యాండ్ విడ్త్ పెరగడం మూలంగా ఒకేసారి ఎక్కువ డివైజ్‌లను వైఫైకి అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆఫీస్, పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటు వైఫై 7లో మల్టీ లింక్ క్యాపబిలిటీస్, మాడ్యులేషన్ ఎవల్యూషన్, ఫ్లెక్సిబుల్ ఛానల్ యుటిలైజేషన్ సహా ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. మల్టీ లింక్ ఫీచర్‌తో వైఫై 7 యూజర్‌కు ఒకేసారి వేర్వేరు ఛానల్స్ ఉపయోగించే వెసులుబాటు కలుగుతుందని తయారీ కంపెనీ తెలిపింది.