ఓఆర్‌ఆర్‌పై సోలార్ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్​కు కేటీఆర్ శంకుస్థాపన

-

హైదరాబాద్ మహానగరం సిగలో మరో మణిహారం చేరనుంది. మహానగరానికి మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు రాబోతోంది. ఐటీ కారిడార్ లో ఆఫీసుకు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లేలా ఓఆర్ఆర్ చుట్టూ నిర్మించనున్న సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలు నిర్వహించేలా ఈ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ వల్ల ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే వేసవిలోగా పూర్తి చేసి నగరవాసులకు అందిస్తామని పేర్కొన్నారు. మొదటి దశలో మొత్తం 23 కి.మీ మేర ఏర్పాటు చేస్తున్నామని.. 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా సోలార్‌ రూఫ్‌తో ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 2023 వేసవి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news