ఫాలోవర్స్‌కోసం.. భార్య స్నానం చేసే వీడియోను నెట్టింట పెట్టిన భర్త..

-

సోషల్‌ మీడియాను ఒక పరిమితి వరకూ వాడుకుంటే.. ఎంటర్‌టైన్ అవ్వొచ్చు..కాస్తో కూస్తో నాలెడ్జ్‌ కూడా పెంచుకోవచ్చు. ఇక మంటి కంటెంట్‌ ఉంటే.. ఫాలోవర్స్‌ వస్తారు..? ఇన్‌కమ్‌ కూడా ఉంటుంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన ఈ కాలంలో చాలా మంది వాటిలోనే మునిగి తేలుతున్నారు. తమ టాలెంట్‌ను ఉపయోగించి వీడియోలు చేస్తూ అందులో పోస్టు చేస్తారు. ఫాలోవర్స్‌ను ఆకట్టుకునేందుకు చాలా రకాల జిమ్మిక్కులు కూడా చేస్తారు. లైకులు, షేర్లు, కామెంట్లు పెరగడం కోసం ఎలాంటి వీడియోలైనా తీసేందుకు వెనకాడరు. దిల్లీ ఉత్తమ్ నగర్లో నివాసముండే 28 ఏళ్ల వ్యక్తి.. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఏకంగా భార్య స్నానం చేసే వీడియోను నెట్టింట పెట్టేశాడు..
న్యూ దిల్లీలో ఉత్తమ్ నగర్‌లో నివాసం ఉండే 28 ఏళ్ల వ్యక్తి సోషల్‌ మీడియా పిచ్చిలో మునిగిపోయాడు. తన పేజీలో వివిధ రకాలు వీడియోలు పోస్టు చేస్తాడు. అలా సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను సంపాదించుకునే పనిలో పడ్డాడు. ఎంతకీ ఫాలోవర్స్ పెరగడం లేదు. అయితే అతను దిల్లీలో ఉంటాడు. అతని భార్య మాత్రం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఉంటుంది. ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రోజు స్నానం చేస్తుండగా వీడియో కాల్ మాట్లాడుకుందామంటూ భార్యను బలవంతం చేశాడు. అతని ఒత్తిడి తట్టుకోలేని ఆ మహిళ చివరికి తను చెప్పిందే చేయాల్సి వచ్చింది. స్నానం చేస్తూ భర్తతో వీడియో కాల్ మాట్లాడింది.
అలా వీడియో కాల్ మాట్లాడుతుండగా దానిని రికార్డు చేశాడు భర్త. ఫేస్ బుక్‌లో తన పేజీకి ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఆ వీడియోను వాడుకోవాలనుకున్నాడు.. తన పేజీలో తన భార్య స్నానం చేస్తున్నప్పటి వీడియోను పోస్టు చేశాడు. దాంతో పాటు ఆమె వ్యక్తిగత ఫోటోలను కూడా పెట్టేవాడు..
ఒక రోజు ఫేస్ బుక్ చూస్తుండగా.. తన వ్యక్తిగత ఫోటోలను గమనించిన భార్య.. భర్తను నిలదీసింది. ఆ ఫోటోలను, వీడియోను తీసేయమని అడిగింది. దానికి అతడు ఒప్పుకోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫేస్ బుక్ కంపెనీని ఆశ్రయించి నిందితుడి ఫేస్ బుక్ పేజీని, ఖాతాను తొలగించారు.
ఫాలోవర్స్ కోసం.. మరి ఇంత దిగజారుతున్న ఈరోజుల్లో.. మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లవరే కదా, భర్తే కదా అని అలా వీడియో కాల్స్‌ మాట్లాడితే ప్రమాదమే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news