నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తో తెలంగాణ మంత్రుల భేటీ

-

తెలంగాణలో యాసంగి వ‌రి ధాన్యం కొనుగోళ్ల పై స్ప‌ష్ట‌త కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం నేడు కేంద్ర ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ‌ల మంత్రి పీయూష్ గోయ‌ల్ తో స‌మావేశం కానున్నారు. రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొనుగోళ్లు చేస్తారో రాత పూర్వ‌కంగా హామీ ఇవ్వాల‌ని కోర‌న్నురు. కేంద్ర మంత్రులు ఎంత వ‌రి ధాన్యం అయినా.. కొనుగోలు చేస్తామ‌ని అంటున్నార‌ని.. అది క్లారిటీ లేద‌ని రాత పూర్వ‌కంగా హామీ ఇవ్వ‌ల‌ని కోర‌నున్నారు. అలాగే వాన కాలం వ‌రి ధాన్యం కేంద్ర ప్ర‌భుత్వం 60 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల కొనుగోలు చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. కాగ తెలంగాణ లో ఇప్ప‌టి వ‌ర‌కే 55 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రి ధాన్యం కొనుగోళ్లు జ‌రిగాయ‌ని అన్నారు.

మ‌రి కొంత స‌మ‌యంలో నే 60 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నులకు చేరుతుంద‌ని తెలిపారు. అయితే త‌ర్వాత వ‌చ్చే వ‌రి ధాన్యం ఎవ‌రూ కొనుగోలు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కాగ తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ కి వెళ్లి రెండు రోజులకు పైగా అవుతున్నా.. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ల‌భించ‌లేదు. దీంతో టీఆర్ఎస్ పార్ల‌మెంటరీ నేత కే కే, లోక్ స‌భ ప‌క్ష నేత నామా నాగేశ్వ‌ర‌రావు కేంద్ర మంత్రి ని పార్ల‌మెంట్ లో క‌లిసి.. స‌మావేశం గురించి చ‌ర్చించారు. దీంతో ఈ రోజు మ‌ధ్య‌హ్నం 2: 30 గంట‌ల‌కు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రుల బృందం మ‌ధ్య స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news