డిసెంబరు తొలి వారం వరకు సచివాలయం రెడీ..!

-

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. డిసెంబర్ తొలివారంలోగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. విజయదశమికి ప్రారంభించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు నిర్దేశించిన లక్ష్యం. ఆయన ఇటీవల సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

సచివాలయాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరో మూడున్నర, నాలుగు నెలల సమయ పడుతుందని అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పండగ సందర్భంగా గృహప్రవేశ పూజాదికాలను నిర్వహించడమా? లేక నిర్మాణం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేదాకా వేచి ఉండి ధనుర్మాసానికి ముందు ప్రారంభించడమా? అనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జలు పడుతోంది.

తొలుత 6 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించినా… ప్రస్తుతం అది 8.60 లక్షల చదరపు అడుగులకు చేరింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారు. 2019 జూన్‌లో సచివాలయ నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నమూనాలు సిద్ధమై తొలి స్లాబు వేసేందుకు 2021 జనవరి అయింది.

కరోనా కారణంగా నాలుగు నెలల పాటు ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. ఆ తరవాత నుంచి పనుల వేగాన్ని పెంచారు. అన్ని అంతస్తుల్లోనూ పనులు ఒకేసారి జరిగేలా రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రణాళికను రూపొంచడంతో పాటు… పనుల తీరు తెన్నులను రోజువారీగా సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది నవంబరు చివరి వారం లేదా డిసెంబరు తొలి వారానికి భవన ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news