తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదవ తరగతి, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అలాగే జూన్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ పేర్కొంది.

ఓపెన్ టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలను ఒకేరోజున ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది విద్యాశాఖ. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి.. రావాలని లేకపోతే… పరీక్షకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది విద్యాశాఖ. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news