టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ రెండు గంటలు ఉచిత ప్రయాణం

-

తెలంగాణ ఆర్టీసీ వరుస ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఓ పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయించింది. అందేంటంటే..?

తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్సకోసం వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయంచింది. ఏదైనా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చూపించుకోడానికి వెళ్లి.. అక్కడి వైద్యులను సంప్రదించాక తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్ఛు ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందుల చిట్టీపైనే సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్‌కు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి వీలుంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కడివరకైనా ఇలా ఉచితంగా చేరుకోవచ్ఛు

దూరప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఎంజీబీఎస్‌తోపాటు నగరంలో ఎక్కడ దిగినా తర్వాత 2 గంటలు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చని రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ సామ్యుల్‌ చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news