కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. తెలంగాణలో మరో రెండ్రోలు వర్షాలు

-

తెలంగాణపై వరణుడు పంజా విసురుతున్నాడు. వరణుడి బీభత్సంతో రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమ కష్టమంతా కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు.

దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా బుధ, గురువారాల్లోనూ చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఇక మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. భారీ వర్షాలకు, ఈదురుగాలులకు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news