సిద్దిపేట జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ సిద్దిపేటలోని మైనంపల్లి అంబేద్కర్ చౌక్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
పొన్నాల నుంచి పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి పాత బస్టాండ్ వెళ్లేవిధంగా కాంగ్రెస్ ప్లాన్ వేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో రూట్ మార్చుకోవాలని పోలీసుల సలహా ఇచ్చారు. ముందు ఫిక్స్ చేసుకున్న రూట్ లోనే వెళ్తామని కాంగ్రెస్ నాయకుల పట్టుబట్టారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో భారీగా పోలీసులు మోమరించారు. క్యాంపు ఆఫీస్ వైపునకు కాంగ్రెస్ నాయకుల వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసారు. మరోవైపు రుణమాఫీ పై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మాజీ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నాయకులు, అధికారులు పాల్గొననున్నారు.