కాంగ్రెస్ హామీల నుంచి దృష్టి మళ్లించడానికే రాష్ట్రంలో ప్రస్తుతం విగ్రహాల వివాదం నడుస్తుందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల నుంచి దృష్టి మళ్లించడానికే తెరపైకి ఈ వివాదం తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా.. ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్, BRS సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులకు సరిగ్గా రుణమాఫీ లేక రైతులు సతమతం అవుతున్నారని.. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ రైతు రుణమాఫీ బోగస్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.