హైదరాబాద్ లో దారుణం.. టెన్త్ అమ్మాయిపై విద్యార్థుల గ్యాంగ్ రేప్

-

దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కింద మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ… కొందరు మానవ మృగాలు మహిళలపై లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు. వాయు, వరస లేకుండా కామ క్రోదులుల ప్రవర్తిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది.

హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని 30 అన్నారం వైయస్సార్ కాలనీ లో పదో తరగతి విద్యార్థిని పై తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి మరి రేప్ చేశారు. అత్యాచారాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు.

ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వీడియోలు పెడతామని ఆ అమ్మాయిని బెదిరిస్తూ పది రోజుల తర్వాత మళ్లీ రేప్ చేశారు. అయితే తల్లిదండ్రులు ఫిర్యాదుతో నిందితులపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగిందని దానిపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news