ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు – బండి సంజయ్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది హైకోర్టు. బైంసా సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలన్న కోర్టు.. బైంసా సిటీకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచనలు చేసింది. అయితే కోర్టు తీర్పు పై హర్షం వ్యక్తం చేశారు బండి సంజయ్. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయాత్రను కొనసాగిస్తామని తెలిపారు.

 

అందులో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని ఆడేల్లి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళుతున్నానని బండి సంజయ్ తెలిపారు. ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచే లాంచనంగా పాదయాత్రను ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఏదో ఒక కుంటి సాకుతో పాదయాత్రని అడ్డుకోవాలని చూస్తుందని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటామని.. వారి కష్టసుఖాలలో పాల్పంచుకుంటామని, వారికి భరోసా కల్పిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news