ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ.. మరికాసేపట్లో తెలంగాణ సీఎం పేరు ప్రకటన..!

-

ఢిల్లీ వేదికగా తెలంగాణ సీఎం అభ్యర్థి పై సీరియస్ గా కసరత్తు జరుగుతుంది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ జాతీయ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏఐసిసి చీప్ మల్లికార్జున కార్గే నివాసంలో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, థాక్రే హాజరయ్యారు. సీఎం ఎంపిక బాధ్యతను ఐకమందు కప్పగిస్తూ తెలంగాణ సీఎం చేసిన ఏకవాక తీర్మానాన్ని శివకుమార్ ఖ ర్గేకు అందించనున్నారు. అనంతరం దీనిపై రాహుల్ కే సి వేణుగోపాల్ కార్గే చర్చలు జరిపి సీఎం అభ్యర్థి ఎంపికను ఓ కొలిక్కి తీసుకురానున్నారు. తెలంగాణ సీఎం అభ్యర్థి పేరును మరికాసేపట్లో ప్రకటించనున్నారు.

అంతకు ముందు ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో నలగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు ఈ సమావేశం తర్వాత డీకే కర్గే నివాసానికి బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం చేసిన ఏకవాక్య తీర్మానాన్ని పార్టీ జాతీ అధ్యక్షుడు కార్గేకు అందిస్తానని తెలిపారు సీఎల్పీ తీర్మానంపై కార్గేనే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. సీఎల్పీ నేత సీఎం ఎవరు అనేది ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం ఎంపీ కలయానికి కట్టుబడి ఉంటానని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version