పార్టీని విడిచిపెట్టే వారు పవర్ బ్రోకర్లు : హరీశ్ రావు

-

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకీ ఊహించని విధంగా షాక్ తగులుతోంది. ముఖ్యంగా పార్టీని వీడుతున్నారు కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు. దీంతో వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని అయిపోతుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పేర్కొంటున్నాయి.రాజ్యసభ సభ్యులు కేకే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కడియం శ్రీహరి కూతురు కావ్యలతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లోని కీలక నేతలు పార్టీ మారడంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ మార్పులపై స్పందించారు. తెలంగాణలో నిన్న, ఇవ్వాళ జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు చూస్తున్నామని, కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది మనకు ఏమన్నా కొత్తనా అని, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టుమని పది మంది లేకున్నా కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని, రానే రాదు.. కానే కాదు అన్న తెలంగాణని తెచ్చి పెట్టాడని తెలిపారు. అంతేగాక ఇప్పుడు ఆకులు రాలే కాలం నడుస్తోందని, ఈ రుతువులో పనికిరాని ఆకులన్నీ రాలి చెత్తకుప్పలో కలిసిపోతున్నాయని, మూలం మాత్రం అలాగే ఉంటుందని, కొన్ని రోజుల తర్వాత కొత్త చిగుర్లు వస్తాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version