తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) ఆదివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మల్లు స్వరాజ్యం .. కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. కాగ ఆదివారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కాగ మల్లు స్వరాజ్యం అంత్య క్రియలు నేడు జరగనున్నాయి. నేడు మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండలో మల్లు స్వరాజ్యం అంత్య క్రియలు నిర్వహించనున్నారు.
దీనికి ముందు.. మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ లో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఉంచనున్నారు. సీపీఎం కార్యకర్తులు, ప్రజల సందర్శనార్థం మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని దాదాపు 4 గంటల పాటు సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఉంచనున్నారు. అనంతరం మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని నల్గొండ జిల్లాకు తరలించి అక్కడ అంత్య క్రియలు చేయనున్నారు. కాగ మల్లు స్వరాజ్యం చివరి వరకు సీపీఎం పార్టీ లోనే ఉన్నారు. సీపీఎంలో పలు కీలక బాధ్యతలను కూడా నిర్వహించారు.