సామూహిక వివాహాల కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి..!

-

త్రిదండి చిన్నజీయర్ స్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో పర్యటించారు. గురువారం మండలంలోని అనంతారం గ్రామంలో నిర్వహించే 165 సామూహిక వివాహలు జరిపించేందుకు సామాజిక సేవ నాయకురాలు, ట్రస్ట్ సభ్యురాలు గంట రాధ ఆధ్వర్యంలో పాల్గొని వివాహాలు జరిపించారు. ముందుగా 165 మంది జంటలకు పూజలు నిర్వహించి మానవాళి పెళ్లి జీవితంపై పలు సూచనలు చేశారు. భార్య, భర్తల దాంపత్యం గురించి దంపతులకు వివరించారు.

అనంతరం జంటలకు మంగళ సూత్రాలు, మెట్టలు పంపిణి చేశారు. తదనంతరం వేద మంత్రాలు, వాయిద్యాలతో జంటలకు కళ్యాణ మహోత్సవం జరిపించారు. ప్రతి జంటను అక్షింతలతో ఆశీర్వదించి తలంబ్రాలు చల్లారు. త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు ముగ్గురు జీయర్లు దంపతులను ఆశీర్వదించారు. 165 మండపాలలో 30 మంది పరివార్లు కూడా పాల్గొన్నారు. దీంతో త్రిదండి చిన్నజీయర్ స్వామి వస్తున్నారని తెలుసుకున్న జనం భారీ సంఖ్యలో పాల్గొని చిన్నజీయర్ స్వామి ప్రసంగాన్ని, కళ్యాణ మహోత్సవాలను వీక్షించారు. అనంతరం త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదాన్ని పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news