48 గంటల్లో ఇండియా కూటమి ప్రధానిని ఎన్నుకుంటాం : జైరాం రమేష్

-

మరో 48 గంటల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ తమ నాయకత్వానికి సహజ హక్కు దారుగా ఉంటుందని తెలిపారు. గురువారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. మెజారిటీకి అవసరమైన 272 సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇండియా కూటమి గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. స్పష్టమైన మెజారిటీ వస్తుంది కాబట్టి ప్రధాని ఎంకపై నిర్ణయం తీసుకోవడానికి 48 గంటల కంటే తక్కువ సమయం పట్టొచ్చని తెలిపారు. అధికారంలోకి రాగానే ఎన్డీయే పార్టీలు సైతం కూటమిలో చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే వారిని కూటమిలో చేర్చుకోవాలా వద్దా అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.

జేడీయూ, టీడీపీ వంటి ఎన్డీయే మిత్రపక్షాలకు ఎన్నికల అనంతరం తలుపులు తెరిచి ఉంటాయా అని అడిగిన ప్రశ్నకు జైరాం రమేశ్ స్పందిస్తూ.. 2019లో టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పని చేసిందని గుర్తు చేశారు. కొన్ని ఎన్డీయే పార్టీలు సంకీర్ణంలో చేరే చాన్స్ ఉందని, పార్టీ అగ్రనేతలు బర్గే, రాహుల్, సోనియాలు వారిని కూటమిలో చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయిస్తారని చెప్పారు. కాగా, ఏడు దశల లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికీ ఆరు విడతల పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీన చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జైరాం రమేశ్ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news