ఏపీలో పోలింగ్ ముగిశాక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి…ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు….రాష్ట్రానికి కాబోయే ముఖ్య మంత్రి ఎవరు అనే అంశాలపై వాడవాడలా చర్చలు జరుగుతున్నాయి.ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న నాగన్న సర్వే… రానున్న ఫలితాలపై అంచనాలను వెల్లడించింది.ఏపీలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే రాబోతోందని,ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని కుండబద్దలు కొట్టారు.50.98 శాతం మంది ఓటర్లు జగన్నే మళ్ళీ సీఎంగా కోరుకుంటున్నారని 39.75శాతం మంది మాత్రమే చంద్రబాబువైపు ఉన్నారని తేల్చేసింది.ఏపీలో మొత్తంగా 81.89 శాతం పోలింగ్ నమోదు కావడంతో రానున్న ఫలితాలపై ఎవరికి వారు అనుకూలంగా అంచనాలు వేసుకుంటున్నారు.
ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది.గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాస్త పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది.దీనిని బట్టి చూస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వైసీపీకే ఉంటుందని నాగన్న సర్వే చెబుతోంది.మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలలో వైసీపీ 96 సీట్లను గెలుస్తుందని…,33 చోట్ల హోరాహోరీ ఫైట్ నడుస్తుండగా 22 స్థానాల్లో వైసీపీకే ఎడ్జ్ వస్తుందని ఈ సర్వే అంచనా వేస్తోంది.కూటమి పార్టీలు 46 స్థానలను గెలుచుకుని టైట్ ఫైట్ ఉన్న సీట్లలో మూడింటిలో మాత్రమే ఎడ్జ్ వస్తుందని తేల్చేశారు.కేవలం 8 స్థానాల్లో మాత్రమే భీకర పోరు నడుస్తుందని ఈ సర్వే పేర్కొంది.ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే వైసీపీ నేరుగా 17 స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని ఈ సర్వే చెప్పింది. కూటమి నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పేసింది. మరో నాలుగు సీట్లలో మాత్రమే హోరాహోరీ పోరు నడుస్తుందని అందులో కూడా 3 సీట్లు వైసీపీకే ఎడ్జ్ ఉందని తెలియజేసింది.గత నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నాగన్న సర్వే చెప్పిన లెక్కలు నిజమయ్యాయి.ఈ నేపథ్యంలో ఏపీపై విడుదల చేసిన అంచనాలతో వైసీపీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చినట్లయింది.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే…..శ్రీకాకుళం జిల్లాలో మొత్తం సీట్లు ఉండగా అందులో 6 వైసీపీ ఖాతాలోకి నాలుగు టీడీపీ ఖాతాలోకి రానున్నట్లు తేలింది. విజయనగరం జిల్లాలో 9 సీట్లు ఉండగా మొత్తం వైసీపీ ఖాతాలోకి వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది.ఒక్క విజయనగరం స్థానంలో తీవ్ర పోటీ నడిచినా వైసీపీకే ఎడ్జ్ ఉంటుందని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో 12 సీట్లు ఉండగా 5 సీట్లలో కూటమి,7 సీట్లను వైసీపీ గెలుచుకోనుంది.తూర్పుగోదావరి జిల్లా 19 సీట్లకు గాను వైసీపీ 10,కూటమి 9 సీట్లను గెలుచుకోనున్నాయి.పశ్చిమ గోదావరిలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా 7 వైసీపీ,8 కూటమి గెలవనున్నాయి.ఉమ్మడి కృష్ఝా జిల్లాలోని 16 సీట్టలో 10 సీట్లలో వైసీపీ,మూడు సీట్లు కూటమి వశం కానున్నాయి. మరో మూడు స్థానాల్లో తీవ్ర పోటీ నడుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 సీట్లలో 10 వైసీపీ,7 కూటమి గెలుచుకుంటాయని ఈ సర్వే తేల్చింది.
ప్రకాశం జిల్లాలోన 12 స్థానాల్లో మూడు కూటమి గెలవనుండగా 8 వైసీపీ గెలుచుకుంటుంది.మరో స్థానంలో తీవ్ర పోటీ నడుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో ఈసారి మొత్తం 10 స్థానాలను వైసీపీ గెలవబోతున్నట్లు అంచాన వేస్తున్నారు.మూడు చోట్ల తీవ్ర పోటీ నడిచినా వైసీపీకే ఎడ్జ్ ఉందని ఈ సర్వే తేల్చింది.కర్నూలు జిల్లాలోని 14 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోనుంది.ఇక అనంతపురం జిల్లాలోని 14 స్థానాలకు గాను వైసీపీ 9,కూటమి నాలుగు సీట్లను గెలుచుకోనున్నాయి.కడప జిల్లాలోని 10 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఈసర్వేలో తేలింది.చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో వైసీపీ 12, కూటమి రెండు స్థానాలను గెలవబోతున్నట్లు నాగన్న సర్వే కుండబద్దలు కొట్టింది. పోలింగ్‌కి ముందు పోలింగ్ తరువాత వచ్చిన చాలా సర్వేలు వైసీపీకే పట్ట కట్టడంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు.