నీతి ఆయోగ్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన టిఆర్ఎస్.. దమ్ముంటే చెప్పండి !

-

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై స్పందించిన నీతి ఆయోగ్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మీరు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నది వాస్తవం కాదా..? నీతి ఆయోగ్ సూటిగా జవాబు చెప్పాలన్నారు బోయినపల్లి వినోద్ కుమార్.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మీరు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా అయినా ఇచ్చిందా..? సూటిగా, స్పష్టంగా సమాధానం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నీతి ఆయోగ్ కు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ పై నీతి ఆయోగ్ స్పందించిన అంశంపై వినోద్ కుమార్ ప్రశ్నలను కురిపించారు.

మిషన్ భగీరథకు రూ. 19,250 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5,000 ( ఐదు వేల కోట్లు ) వేల కోట్లు కలిపి మొత్తం 24,250 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు ఐదేళ్ల క్రితం సిఫార్సు చేశారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా రాష్ట్రానికి విడుదల చేయలేదని, ఇది వాస్తవం కాదా..? అని వినోద్ కుమార్ నీతి అయోగ్ ను ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేవనెత్తిన అంశంలో తప్పు ఎక్కడ ఉందని వినోద్ కుమార్ నీతి అయోగ్ ను ప్రశ్నించారు. ఈ రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వని మాటా నిజం కాదా..? సూటిగా సమాధానం ఇవ్వాలని వినోద్ కుమార్ నీతి అయోగ్ కు డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news