ఆ తప్పులు కారణంగానే కేసీఆర్ ఇప్పుడు వణుకుతున్నారా ?

-

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడం, అతి సమీపంలోని పోలింగ్ తేదీ ఉండడం, ప్రచారానికి తక్కువ సమయం ఉండడం వంటి వ్యవహారాలు కారణంగా, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత కంగారు ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ లోని కీలక నాయకులు అందరినీ గ్రేటర్ హైదరాబాద్ లో మోహరించారు. డివిజన్ల వారీగా అందరికీ బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా అందరిని వాడేసుకుంటున్నారు. గ్రేటర్ బాధ్యతలు మొత్తం కేటీఆర్ భుజ స్కంధాలపై వేసిన, కెసిఆర్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయారు.

ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీ పై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఆయన వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తే గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై అనుమానం కరిగినట్టు గానే కనిపిస్తోంది. అందుకే బిజెపి విషయంలో అంతగా టెన్షన్ పడుతున్నట్లు గా కనిపిస్తున్నారు. దీనికి తోడు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చెందడాన్న ఇప్పటికీ కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం అయిన దుబ్బాక లో సెంటిమెంట్ సైతం పక్కనపెట్టి బీజేపీ వైపు ఏ విధంగా జనాలు మళ్లారు అనేది తెలియక సతమతం అవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేక అభ్యర్థి బలహీనంగా ఉన్నారా అనే విషయంలో క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు.

అసలు తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. అయినా అవేమీ కెసిఆర్ కు విజయం సాధించి పెట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా యువత టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు గా ఇంటిలిజెన్స్ సర్వేల్లో స్పష్టం అయింది. తెలంగాణ వస్తే లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అంటూ టిఆర్ఎస్ అప్పట్లో హామీ ఇవ్వడం, ఆ హామీని నెరవేర్చకపోవడం వంటి కారణాలతో యూత్ ఎక్కువగా టిఆర్ఎస్ పై ఆగ్రహంతో బీజేపీకి దగ్గర అయినట్లుగా కెసిఆర్ అంచనా వేస్తున్నారు. దీనికి తోడు టిఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఉంటూ వచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డిని తక్కువగా అంచనా వేయడం, ఆయన పార్టీ కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారనే ఈ విషయం తెలిసినా ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించకపోవడం, ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి టిఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లను భారీగా చీల్చడం, ఎలా ఎన్నో అంశాలు అక్కడ ఓటమికి దారితశాయి. ఇప్పుడు గ్రేటర్ లోను దాదాపు ఇదే పరిస్థితి కనిపించడం తో కెసిఆర్ కాస్త కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news