రేపే టీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం..BRSపై ప్రకటన !

-

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు టీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనున్నది. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరుగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనున్నది.

సమావేశంలో శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్ననున్నారు. అయితే, ఈ సమావేశంలో.. బీఆర్‌ఎస్‌ విస్తరణ, బీజేపీ పై వ్యూహాలు లాంటి వాటిపై సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే.. చివరగా గత సెప్టెంబర్‌ నెలలో తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజ‌ర‌య్యారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చర్చించారు. టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం ప్రారంభం కంటే ముందు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news