TSPSC పేపర్ లీక్ కేసు.. ఆ ఇద్దరికీ పాస్‌వర్డ్‌ ఎలా తెలిసింది?

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్, ఈడీ అధికారులకు.. ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డికి కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎలా తెలిసిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రశ్నపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ డైరీలో రాసిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లు నిందితులు పోలీసుల దర్యాప్తు, సిట్‌ కస్టడీలోనూ ఒకేవిధంగా సమాధానమిచ్చారు. అయితే ఆమె డైరీని స్వాధీనం చేసుకొని పరిశీలించిన సిట్‌ అధికారులు దానిలో ఎక్కడా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ రాసినట్లు ఆధారాల్లేవని నిర్ధారణకు వచ్చారు. సిట్‌ పోలీసులు, ఈడీ అధికారుల విచారణలోనూ శంకరలక్ష్మి ఇదే విషయాన్ని చెప్పారని సమాచారం.

మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో మరికొందరు ఉన్నట్లు గుర్తించి అనుమానితుల జాబితాను సిట్‌ రూపొందించినట్లు సమాచారం. వారిలో ఇద్దరు గ్రూప్‌-1, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్ష రాసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరికీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధాలున్నాయా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news