సిట్‌ నివేదిక వచ్చాకే ఆ ఫలితాలు : టీఎస్పీఎస్సీ

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 40కిపైగా మందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన ఫలితాల విడుదలపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. రాతపరీక్షలు పూర్తయిన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల  తదుపరి ప్రక్రియలు.. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు తుది నివేదిక వచ్చేవరకు నిలిపివేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.

సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఫలితాలు వెల్లడించి, తుది ఎంపికలు చేపట్టడం న్యాయసూత్రాలకు విరుద్ధమని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. సాంకేతిక, న్యాయ ఇబ్బందులూ తలెత్తవచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో  పూర్తివి వరాలు వెల్లడయ్యేవరకు వేచి చూడాలని భావిస్తోంది. నిందితులు ఏయే ప్రశ్నపత్రాలు లీక్‌ చేశారు? ఎంత మంది కొనుగోలు చేశారనే విషయాలపై సిట్‌ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే 40కిపైగా మందిని అరెస్టు చేసి విచారిస్తోంది. మరోవైపు ఆయా పరీక్షల ఫలితాల కోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూడాల్సి వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news