అద్భుతమైన స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ. 70 లక్షలు మీ సొంతం..

-

చిన్న పొదుపు పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు..ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో మంచి మొత్తం సంపాదించవచ్చు..చిన్న పొదుపు పథకం కింద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, NSC, సుకన్య సమృద్ధి యోజన మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి పథకాలు చేర్చబడ్డాయి. ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు.. ఎంతో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐదేళ్లపాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ మెచ్యూరిటీపై, మీరు 7.7% వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇందులో పెట్టుబడి పరిమితి లేదు. మీకు కావలసినంత మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడిపై ఐదేళ్లలో ఎంత మొత్తం వస్తుందో తెలుసుకోవడం మంచిది..

ఉదాహరణకు మీరు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, మీకు రూ. 44,903 వడ్డీ, ఐదేళ్లలో మొత్తం రూ. 1.44 లక్షల కార్పస్ లభిస్తుంది.రూ.5 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో రూ.2.24 లక్షల వడ్డీ అందుతుంది. మొత్తం రూ.7.24 లక్షలు.మీరు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, ఐదేళ్లలో మీకు రూ.4.49 లక్షల వడ్డీ, మొత్తం కార్పస్‌లో రూ.14.49 లక్షలు లభిస్తాయి.ఇక రూ. 20 లక్షలు పెట్టుబడి పెడితే, మొత్తం వడ్డీ రూ. 8.98 లక్షలు, మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 28.98 లక్షలు అవుతుంది.ఐదేళ్ల తర్వాత రూ.30 లక్షల పెట్టుబడిపై రూ.13.47 లక్షల వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ.43.47 లక్షలు.ఐదేళ్లపాటు రూ.40 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం కార్పస్ రూ.57.96 లక్షలు. అందులో వడ్డీ రూ.17.96 లక్షలు.రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీలో మొత్తం రూ. 72.45 లక్షలు అంటే రూ.22 లక్షలకు పైగా వడ్డీనే వస్తుంది..మరో బెనిఫిట్ కూడా ఉంది. ఇందులో పన్ను ఆదా అవుతుంది. దీని కింద ఏటా రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80సి కింద ఈ మినహాయింపు కూడా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news