ఫేస్ బుక్ ప్రేమకు రెండు ప్రాణాలు బలి

-

ఫేస్‌బుక్ ప్రేమ రెండు ప్రాణాలని బలితీసుకుంది. సఫిల్ గూడ వినాయక్ నగర్ కు చెందిన శ్రీకాంత్, రాజేంద్రనగర్ కు చెందిన నికితలకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది‌. జూన్ 4 వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రీకాంత్, నిఖిత. ఈ విషయం తెలిసి ఇద్దరిని విడదీశారు నిఖిత పేరెంట్స్. ఇది తట్టుకోలేక నికిత ఆగస్టు 15వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నిఖిత పేరెంట్స్ వల్లే నా తమ్ముడు చనిపోయాడని శ్రీకాంత్ సోదరి శిరీష ఆరోపిస్తోంది. వాళ్ళిద్దరిని విడదీయడం తోనే ఇద్దరు చనిపోయారని..వదిలేసి ఉంటే ఎక్కడో ఒక దగ్గర బతికి ఉండేవారని అంటుంది. కులం పేరుతో ఇద్దరిని విడదీశారని అంటుంది శ్రీకాంత్ సోదరి శిరీష.

రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి నిఖిత, శ్రీకాంత్ లను విడదీశారని.. రాజేంద్రనగర్ పోలీసులు మాకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. “మా అమ్మకు నేను, మా తమ్ముడు ఇద్దరమే. నా భర్త రెండు నెలల క్రితమే చనిపోయాడు. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. మా కుటుంబాన్ని దిక్కు లేకుండా చేశారు”. అంటూ రోదిస్తోంది శ్రీకాంత్ సోదరి.

Read more RELATED
Recommended to you

Latest news