కేంద్రంలో జుమ్లా పీఎం.. ఇక్కడ హౌలా సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లోని రామ్ లీల మైదానంలో రైతన్నల ధర్నా కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో తెలంగాణలో పండే పత్తి చాలా నాణ్యమైనది అని.. గుజరాత్ లో ఉన్న రూ.8,800 ధరను తెలంగాణలో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు, రైతుల కోసం జైలులో ఉండేందుకు అయినా సిద్దం అన్నారు. ఎవనీ అయ్యకు భయపడేది లేదు.
అసలు చీటింగ్ కేసులు ఎవ్వరి మీద పెట్టాలి.. తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిన ఈ చార్ సౌ బీస్ గాని మీద కేసులు పెట్టాలి. రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ చేయనందుకు రైతులు కేసులు పెట్టాలి. 2లక్షలు ఉద్యోగాలని చెప్పి ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనందుకు యువత కేసులు పెట్టాలన్నారు. కాంగ్రెస్ పాలనలో చివరికీ పోలీసోల్ల భార్యలు కూడా ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. వారు కూడా పోలీసోళ్ల చేతిలో దెబ్బలు తినే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ప్రధాని, రాష్ట్రంలో చిట్టి నాయుడు పరిస్తితి ఒకటే అని పేర్కొన్నారు.