వీడ్కోలు సమావేశంలో వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశంలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని.. ఉపరాష్ట్రపతిగా మీరు చేసిన ప్రసంగాలు మీరు మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని తెలిపారు.

ఈ ఐదేళ్లలో మీరు చేసిన ప్రసంగాల్లో సింహభాగం యువతను, యువ శక్తిని ఉద్దేశించి చేయడం ప్రేరణాత్మకమని.. మాటల మాంత్రికుడిగా మీరు ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేని వెల్లడించారు. మీ మార్గదర్శనంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది. దీంతోపాటు సన్నిహితంగా మీతో కలిసి పనిచేసే అవకాశం కూడా నాకు దక్కింది. అందుకు గర్వపడుతున్నాను. దేశం పట్ల మీకున్న ప్రేమ, గౌరవాభిమానాలకు కృతజ్ఞుడిని.
పార్టీ, ప్రభుత్వం మీకు ఏయే బాధ్యతలను అప్పగించినా వాటిని ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వహించి.. నాలాంటి కార్యకర్తలందరికీ మీరు మార్గదర్శకంగా నిలిచారన్నారు.

మాతృభాష పట్ల మీ అభిరుచి అభినందనీయం, ఆదర్శనీయం. దాదాపుగా మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలో మాతృభాషను కాపాడుకోవడం, ప్రోత్సహించడంపై మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. విద్యార్థి నాయకుడిగా మీరు ప్రారంభించిన ప్రస్థానం, మీ జీవితంలో సాధించిన మైలురాళ్లు చాలా ప్రత్యేకమైనవి. రాజకీయంగా కూడా మీ జీవనం పారదర్శకంగా సాగింది. ఎన్నో విలువలను నిజజీవితంలో అమలుచేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.మీ హయాంలో రాజ్యసభ పనితీరు ఎంతగానో మెరుగుపడింది. సభ్యుల హాజరు గణనీయంగా పెరిగింది. మీ మార్గదర్శనంలో ఎన్నో బిల్లులు విజయవంతంగా ఆమోదమయ్యాయని తెలియజేశారు.