మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

-

మాజీ మంత్రి విజయరామారావు నిన్న కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన మరణించారు. అయితే, సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రి గా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

వారి మరణం పట్ల సిఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్నఅనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news