సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం – విజయశాంతి

-

సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం అన్నారు బీజేపీ పార్టీ నేత విజయశాంతి. ఎంఐఎం, బీఆరెస్ ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అంటూ మండిపడ్డారు రాములమ్మ. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం కూడా అంటూ చురకలు అంటించారు.

vijayashanthi comments on sonia gandhi

అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా? అని నిలదీశారు. ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి, ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. ఒక్క మాటలో, దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా? అని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తామన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version