రోగిష్టి సర్కారును గెంటే రోజులు త్వరలో రావడం ఖాయం -విజ‌య‌శాంతి

-

రోగిష్టి సర్కారును గెంటే రోజులు త్వరలో రావడం ఖాయమని వార్నింగ్‌ ఇచ్చారు విజ‌య‌శాంతి. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు చిన్నపిల్లలతో కిక్కిరిసిపోతున్నయి. హైదరాబాద్‌‌‌‌లోని నీలోఫర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌లోని ఎంజీఎం సహా చాలా హాస్పిటళ్లలోని పిల్లల వార్డుల్లో బెడ్స్ ఫుల్ అయ్యాయి. నీలోఫర్‌‌‌‌‌‌‌‌లో ఒక్కో బెడ్‌పై ఇద్దరిని పడుకోబెట్టి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం వేలాది మంది పిల్లలు అవుట్‌‌‌‌ పేషెంట్లుగా వచ్చి చికిత్స పొందుతున్నరు. జ్వరం, దగ్గు, జలుబుకు తోడు చాలా మంది పిల్లలు న్యుమోనియా ల‌క్ష‌ణాల‌తో వస్తున్నరని డాక్టర్లు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన జ్వరం, పొడి దగ్గు, గురక వంటి లక్షణాలు కనిపిస్తున్నయంటున్నరు. వాతావరణంలో వచ్చిన మార్పులు, అపరిశుభ్ర పరిసరాల వల్ల… బ్యాక్టీరియా, వైరస్‌‌‌‌లు సోకడం వల్ల న్యుమోనియా బారిన పడుతుండొచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నరు. ఈ సీజన్‌‌‌‌లో పిల్లల్లో న్యుమోనియల్ డిసీజెస్ రావడం సహజమే అయినప్పటికీ, ఈసారి కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నరు. పేషెంట్ లోడ్ ఎక్కువగా ఉండడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు తిప్పలు ప‌డుతున్నరు. రాష్ట్రంలో ఉన్న ఏకైక పిల్లల దవాఖాన నీలోఫర్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు.

బెడ్ దొరకడమే గగనంగా మారిపోయింది. ఒక్కో బెడ్డుపై ఇద్దరు ముగ్గురిని ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నరు. ఎమర్జెన్సీ బ్లాక్‌‌‌‌లోని ఐదు ఫ్లోర్లలో ఉన్న వార్డులన్నీ ఫుల్ అయిపోయాయి. మరోవైపు, పేషెంట్‌‌‌‌ లోడుకు అనుగుణంగా శానిటేషన్ వ్యవస్థ పనిచేయడం లేదు. బాత్రూమ్‌‌‌‌లన్నీ కంపు కొడుతున్నయి. వార్డుల్లోని రోజూ చెత్త తొలగించకపోవడంతో కంపు కొడుతోందని పేషెంట్ల అటెండెంట్లు చెబుతున్నరు. నిర్లక్ష్యం, అపరిశుభ్రతతో రాష్ట్రాన్ని రోగాలమయం చేస్తున్న ఈ రోగిష్టి సర్కారును బయటకి గెంటే రోజులు త్వరలో రావడం ఖాయమని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news