తెలంగాణ యువకులకు రాములమ్మ వార్నింగ్!

-

తెలంగాణ యువకులకు రాములమ్మ వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ మాధ్యమంలో నన్ను బెదిరిస్తూ కామెంట్స్ చేసిన నా తెలంగాణ తమ్ముళ్లకు…అధికార రాజకీయ పార్టీలు ప్రతిపక్షాల పట్ల, ప్రజల పట్ల వ్వవహరించాల్సిన ప్రజాస్వామిక విధానాన్ని తెలియజేసినందుకు, నాపై కూడా హెచ్చరికలు జారీ చేసిన స్ధాయికి టీఆర్ఎస్, అనుచరగణం, వారి సోషల్ మీడియా తెగించారని ఫైర్ అయ్యారు.

సరే, తెలంగాణ పోరాటాల బిడ్డను. నాపైన తెగింపు ధోరణిల మీ టీఆర్ఎస్ గూండాలు వ్యవహరిస్తే, యుద్ధం నేర్పిన జీవితం నాది హెచ్చరించారు. ఉద్యమాలు తీర్చిదిద్దిన పంథా నాది…పోరాటాలు, జైళ్లు, తెలంగాణ కోసం సంఘర్షణ నా దశాబ్దాల సంగ్రామం… నా ప్రయాణం…అన్నారు విజయ శాంతి. కొట్లాటకు నేను సిద్ధమే..మీ నేతలు, ఫామ్ హౌస్, ప్రగతి గడి, ప్రైవేటు విమానాలు, వారి బృందం సిద్ధమా? తేల్చుకొండి అని సవాల్ విసిరారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news