ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్​ ముందుకు ఆ నలుగురు వస్తారా..?

-

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ కేసులో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ కాక రేపుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ సహా నలుగురు కీలక అనుమానితులు ఇవాళ విచారణకు హాజరు కావాలని సిట్‌ నోటీసులు ఇవ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మేరకు సంతోశ్, కొచ్చి(కేరళ)లోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్యుడు డా.జగ్గుస్వామి, కేరళలోని భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌) పార్టీ అధ్యక్షుడు తుషార్‌ వెల్లాపల్లి, కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లు విచారణకు రావాల్సి ఉంది.

41ఏ సీఆర్పీసీ నోటీసులు కావడంతో ఆ నలుగురు వ్యక్తిగతంగానే దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలి. ఈ నేపథ్యంలో వీరి వాంగ్మూలాల నమోదు.. తదుపరి దర్యాప్తులో కీలకం కానుంది. విచారణలో కొత్త విషయాలేమైనా వెలుగులోకి వస్తాయా? ఆనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అనారోగ్యం, ఇతరత్రా ముందస్తు కార్యక్రమాలుంటే తప్ప నలుగురూ కచ్చితంగా సిట్‌ విచారణకు ఇవాళే హాజరు కావాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల్లో ప్రధాన నేత అయిన బీఎల్‌ సంతోశ్ విచారణకు రావాల్సి ఉండటం రాజకీయ వాతావారణాన్ని వేడెక్కించే అంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news