వైద్యారోగ్య శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం : హరీశ్ రావు

-

12-14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం, అలాగే 50 పడకల సిహెచ్ సి ఆసుపత్రిని ఖైరతాబాద్ లో మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో 20 వేల మందిని వైద్యారోగ్య శాఖలో భర్తీ చేయబోతున్నామని ప్రకటన చేశారు. అనుమానాలతో టీకాలు వేసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని.. కొవిడ్ ప్రభావం తగ్గిందే తప్ప వైరస్ పూర్తిగా అంతర్ధానం కాలేదని ఆయన వెల్లడించారు.

ప్రంపంచానికే తెలంగాణ వ్యాక్సిన్ హబ్ గా మారిందని.. హైదరాబాద్ కి చెందిన బయాలజికల్ ఇ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కొర్బేవాక్స్ టీకాను అర్హులైన పిల్లలకు ఇస్తామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.
ఈ వయస్సు వర్గం వారు రాష్ట్రంలో 17,23,000 ఉంటారని అంచనా వేస్తున్నామని… 15 మార్చి 2010 తేదీకి ముందు జన్మించిన పిల్లలు వాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో దేశ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని.. కరోనా సమయంలో సేవలు అందించిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news