గొల్ల కురుమలతో ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం – రాజగోపాల్ రెడ్డి

టిఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలను మోసం చేసిందంటూ బిజెపి ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా మునుగోడు పోలీస్ స్టేషన్ వద్ద రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గొల్ల కురుమ ఎకౌంట్ లో వేసిన డబ్బులు ఫ్రీజ్ చేశారని.. ఫ్రీజ్ చేయడం వల్ల వాళ్ళ సొంత డబ్బులు కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

ఎకౌంట్లో వేసిన సొమ్మును మళ్ళీ రిటర్న్ తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. వెంటనే అకౌంట్ల ఫ్రీజ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎత్తి వేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమలతో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గొల్ల కురుమల్ని ఈ విధంగా మోసం చేస్తే.. దళిత బంధిస్తానని దళితుల్ని మోసం చేశాడని మండిపడ్డారు. ప్రతి వర్గానికి హామీలు ఇచ్చి మోసం చేశాడని విమర్శించారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చేంతవరకు మా ఈ పోరాటం కొనసాగుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి.