పెళ్లిళ్లు ఎక్కువగా ఎండాకాలంలోనే జరుగుతాయి. ఉగాది పండుగ అయిన తర్వాతనే.. ప్రతి ఏడాది పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు ఉంటాయి. ఏప్రిల్ మాసంలో ప్రారంభమైన పెళ్లి ముహుర్తాలు దాదాపు జూన్ నెలఖారు వరకు ఉంటాయి. ఈ మూడు నెలల్లో దాదాపు లక్ష నుంచి 2 లక్షల పెళ్లిళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉంటుంది.
అయితే.. ఈ ఏడాది కూడా పెళ్లిల ముహుర్తాలు దండిగానే ఉన్నాయి. వరుసగా మూడు నెలల పాటు మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఈ నెల, మే, జూన్ నెలల్లో చాలా రోజుల పాటు శుభ ముహుర్తాలు ఉన్నాయి. దీంతో ఈ మూడు నెలలూ పెళ్లిళ్లతో మండపాలు కళకళలాడనున్నాయి. డీజే సౌండ్లు, బరాత్ లతో వీధులు హోరెత్తనున్నాయి.ఇక వరుసగా ముహుర్తాలు ఉండటంతో… ఫంక్షన్ హాల్స్, టెంట్ హౌజ్, పంతళ్లను బుక్ చేసుకుంటున్నారు.
ఇక పెళ్లి ముహుర్తాల వివరాల్లోకి వెళితే…
ఏప్రిల్ మాసం : 13, 14, 15, 16, 17, 21, 22, 24
మే : 3, 4, 14, 15, 18, 20, 21, 22, 25
జూన్ : 1, 3, 5, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23