కెసిఆర్ ని ఓడించి బిజెపిలోకి వెళ్తా – కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు తాజాగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట ఓ కేంద్ర మంత్రి, అమిత్ షా లతో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. కేంద్ర బిజెపి నాయకత్వం నుంచి ఆఫర్ రావడంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని, దీనిపై చర్చించేందుకు ఇవ్వాళ నియోజకవర్గంలో ఓ సమావేశం కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారని వార్తలు వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.తానుఅమిత్‌షాని కలిసిన మాట వాస్తవమేనని,కానీ పార్టీ మార్పుపై గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని, కేసీఆర్‌ని ఓడించే బిజెపి పార్టీలోకి వెళ్తానని అన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news