నాన్నా ఇకపై ఫోన్ చూడను.. లెటర్ రాసి యువతి ఆత్మహత్య

-

‘నాన్నా ఇక నేను టీవీ చూడను, ఫోన్‌ చూడను…చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను…ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు’ అని లెటర్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.

ఎస్సై సత్యం కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా, రావల్‌వెల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన కె.స్వామిగౌడ్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. ఇక్కడ జగద్గిరిగుట్ట సమీపంలోని పాపిరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. స్వామి గౌడ్ దంపతులకు కుమారుడు రవికుమార్‌, కుమార్తె దివ్య(21)  ఉన్నారు. దివ్య డిగ్రీ పూర్తిచేసి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసి మానేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆమెను.. ఉద్యోగం చూసుకోకుండా ఇంట్లో టీవీ, ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతున్నావంటూ తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version