రేప్‌ లు చేయడంలో ఇండియాలోనే తెలంగాణనే నంబర్‌ 1 – షర్మిల

-

రేప్‌ లు చేయడంలో ఇండియాలోనే తెలంగాణనే నంబర్‌ 1 అని వైఎస్ షర్మిల సంచలన వ్యాక్యలు చేశారు. షాద్ నగర్ వైయస్సార్ సర్కిల్ వద్ద వైయస్సార్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పాదయాత్రలో భాగంగా సభలో పాల్గొన్న వైయస్ షర్మిల మాట్లాడుతూ.. 8 సంవత్సరాల నుంచి కెసిఆర్ చేస్తున్నది మోసమేనని అన్నారు.

కెసిఆర్ చేతిలో మోసపోని వర్గం తెలంగాణలో లేనే లేదన్నారు. పోలీస్ లను కేసీఅర్ పనోల్లుగా మార్చేశారని.. బీజేపీ కి RSS ఎలాగో ..కేసీఅర్ కి ఈ పోలీస్ లు అలాగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్యం మంత్రి అని.. మద్యం అమ్మకాలు పెరిగి మహిళలపై దాడులు పెరుగుతుంటే చర్యలు లేవని విమర్శలు చేశారు. వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని… వైఎస్సార్ ప్రతి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.  అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కేసీఆర్.. ఆ హామీని గాలికొదిలేశాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news