సుప్రీం కోర్టులో రఘురామ కృష్ణరాజుకు బిగ్ షాక్

-

వైసీపీ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు మరో షాక్‌ తగిలింది. బ్యాంకును మోసం చేశారన్న ఆరోపణలపై ఎంపీ, కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను రద్దు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఎంపీ రఘురామ కృష్ణరాజు కు సంబంధించిన ఇంద్‌ భారత్‌పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.237 కోట్ల మేర ఎగవేసిందని ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదుతో 2021 లో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి విధితమే.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆ సంస్థ డైరెక్టర్‌ రాజ్ కుమార్‌, హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ దుంపల మధుసూదన్‌ రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ ను హై కోర్టు తోసిపుచ్చింది. వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌ పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ ను ఎలా కొట్టి వేయాలని ప్రశ్నించింది. రుణం ఇచ్చిన బ్యాంకును మోసగించి.. రూ.237 కోట్లను మళ్లీంచారన్న ఆరోపణలను హై కోర్టు.. గుర్తించిందని వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news