మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని స్కాములేనని.. మీరు శుద్ధపూసలని నిరూపించుకునే దమ్ముందా..? అని సవాల్ విసిరారు. కెసిఆర్ అంటేనే కరప్షన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
“చిన్నదొర కేటీఆర్ గారు.. వైయస్ఆర్ ఇమేజ్ ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో అగ్రికల్చర్ అయితే.. కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటి పూర్, కేసీఆర్ ఒక యాంటి ఫార్మర్, కేసీఆర్ పాలన యాంటి యూత్, కేసీఆర్ ప్రభుత్వం యాంటి ఉమెన్, కేసీఆర్ అంటే యాంటి మైనారిటీస్ కరప్షన్, కేసీఆర్ అంటే కరప్షన్.. నాగలోకానికి, నక్కకు ఎంత తేడా ఉందో.. వైయస్ఆర్ పాలనకు, కేసీఆర్ పాలనకు అంత తేడా ఉంది.
9ఏండ్ల పాలనలో రాష్ట్రం సమతుల్య అభివృద్ధి అని చెప్తున్న కేటీఆర్ గారు మీకో సవాల్.. మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కాం, మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం, మీరు రియలెస్టేట్ స్కాం చేయలేదని, మీరు సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా..?” అంటూ సవాల్ విసిరారు.